పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్‌(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని ఒక ఎకరాలో వరి నాటు వేశాడు. వర్షాభావం, భూగర్భజలాలు తగ్గిపోయి పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.