పువ్వులను పూజించే సంస్కృతి మనది

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : తెలంగాణలో పువ్వులను పూజించే సంస్కృతి అనాది నుంచి వస్తుందని డీఐఈఓ రుద్రంగి రవి, స్థానిక 44వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గుప్తా అన్నారు.శనివారం పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకట సాయి ఓకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు.విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకోవాలన్నారు.విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల కోలాట ప్రదర్శన పలువురుని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బాల గౌడ్ , చైర్ పర్సన్ విజయలక్ష్మి , ప్రిన్సిపాల్ కళ్యాణి , నాయకులు అనంతుల శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.