పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం
అరెస్ట్ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు
న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్ కు ఢల్లీి హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఆమె అరెస్టుపై స్టే ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నకిలీ ధృవపత్రాలతో ఉత్తీర్ణత సాధించిందన్న ఆరోపణపై ఢల్లీి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా ముందస్తు బెయిలు కోరుతూ పూజా ఖేడ్కర్ ఢల్లీి హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అరెస్టుపై ఆగస్టు 21 వరకు స్టే ఇచ్చింది కోర్టు. అంతేకాక ఊరట ఇవ్వడాన్ని నిరాకరించిన ట్రయల్ కోర్టు తీర్పును తప్పుపట్టింది. ఇదివరలో పూజా ఖేడ్కర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ను పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.