పూర్ణాహుతితో రుద్రహోమాలు పరిసమాప్తి*
ముగిసిన కార్తీక మాసం*
*నెలరోజుల పాటు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు*
*అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)*కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతిరోజు ఆలయంలో రుద్రహోమాలు నిర్వహించారు. బుధవారం అమావాస్య పురస్కరించుకొని కార్తీకమాసం ముగియనుం డడంతో రుద్రహోమాలకు పరిసమాప్తి పలుకుతూ ఆలయ ఈవో పురెంద్ కుమార్ పూర్ణాహుతిని సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదమంత్రాలు మధ్య గోమాతకు పూజలు నిర్వహించి, పూర్ణాహుతి ద్రవ్యాలను ఆలయ ఈవో పురెంధర్ కుమార్, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మరియు ఆలయ ధర్మకర్తలు శిరస్సుణ ధరించి గోమాత సైతంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి జరుగుతున్న రుద్రహోమాలకు పూర్ణాహుతిని సమర్పించి మాస దీక్షకు స్వస్తి పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఆలయ చరిత్రలో తొలిసారి కార్తీకమాసం సందర్భంగా నిరంతరంగా నెలరోజుల పాటు రుద్రహోమం నిర్వహించడం ఇదే తొలిసారి అని రుద్రహోమాలకు భక్తుల నుండి మంచి విశేషమైన స్పందన లభించినట్టు తెలిపారు. పాలకమండలి కమిటీలో మరోమారు చర్చించి ప్రతి సోమవారం కూడా ప్రధానాలయమైన బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రహోమాలు నిర్వహించే అంశంపై చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోచైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,వేద పండితులు వంకాయల శ్యామ్ కుమార్ శర్మ, ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ, ఆలయ ధర్మకర్తలు హరిబాబు, ఉషాదేవి,అనంతేశ్వరెడ్డి, జయన్న తదితరులు పాల్గొన్నారు