పూర్తిస్థాయికి చేరుకున్న గడ్డెన్న వాగు

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

నిర్మల్‌,జూలై13(ఆర్‌ఎన్‌ఎ): భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 52,100 క్యూసెక్కుల వదర నీరు చేరుతోంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.40 అడుగులు ఉంది. ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు
విడుదల చేయడంతో సవిూపంలో ఉన్న రెండు పెట్రోల్‌ బాంక్‌లు, ఎన్‌ఆర్‌ గార్డెన్‌, వివేకానంద చౌక్‌, ఆటో నగర్‌, బాగ్యానగర్‌లు నీట మునిగాయి. భైంసా నుంచి నిజామాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి.. భైంసా`దెగాం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది.