పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 18 : చేర్యాల మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 1992-1993వ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం చేర్యాల పట్టణంలోని గ్రామ శివారులో 30 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలిసి బాగోగులు చెప్పుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నాడు బాల్యంలో ఒకే బడిలో కలిసి చదువుకొని పాఠాలు నేర్చుకొని ఎంతో గొప్పవాల్లమయ్యామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చీకోటి విజయ్ కుమార్, శివగారి అంజయ్య,ఉప్పల రాజేందర్, గుస్క గోవర్ధన్, బైరగోని ప్రసాద్, బందెల మహిపాల్ రెడ్డి, పిన్న మహేష్, నాగపూరి విక్రమ్,అంబాల శ్రీనివాస్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area