పూలేకు సీఎం కేసీఆర్ నివాళులు

f6a8pm5m

మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్ పేటలో జరిగిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, మంత్రులు పద్మారావు, తలసాని పాల్గొని పూలేకు నివాళి అర్పించారు.