పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. బిసి విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్9.(జనం సాక్షి):
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వలన రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని గత నెలలోనే ఆర్టీసీ చార్జీలు పెంచడం జరిగిందని మళ్ళీ ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం ఎంతవరకు సబబు అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం కన్వీనర్ డి.అరవింద్ చారి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ,విద్యుత్ ఛార్జీలను పెంచినప్పుడు ఏలాగైతే బషీర్ భాగ్ సంఘటనను తిరిగి పునరావృతం చేస్తామని హెచ్చరించారు.అనాలోచిత చర్యలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి పోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అరవింద్ చారి హెచ్చరించారు.రెండు రోజుల్లో దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమంనకు పిలుపునివ్వడానికి కూడా వెనకాడబోమని తెలిపారు.