పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఎస్.కృష్ణ ఆదిత్య.
ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):-
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య జిల్లా వివిధ శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తు దారుల నుండి కలెక్టర్ నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.
మొత్తం 39 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలో పెండింగ్లో ఉన్న పనుల సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
వర్షా ప్రభావం ఎక్కువ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యశాఖ మెడికల్ కొరత లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సూచించారు.వెంకటాపురం మండలం ఏదిరా ప్రాథమిక పాఠశాల భవనాన్ని శిథిల వ్యవస్థలో ఉన్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయాలని నేటి కొరత లేకుండా చూడాలన్నారు.పరిశ్రమల శాఖ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు రుణాలు అందించాలని పరిశ్రమల జిల్లా అధికారిని  ఆదేశించారు.
రోడ్డు మరుమత్తుల పనులు వారంలో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, పిఆర్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్,డిఆర్ఒ కే రమాదేవి, వైద్యాధికారి అప్పయ్య, వ్యవసాయ అధికారి గౌస్ హైదర్ కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్,డిడబ్లూఓ హేమలత బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.