పెట్టుబడిదారి వ్యవస్ధ పతనం తప్పదు
చేర్యాలజూన్ 18, (జనంసాక్షి):
మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరుగుతున్న వారం రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని ఉద్దేశించి సీపీయం పార్టీ రాష్ట కమిటీి సభ్యులు మెట్టు శ్రీనివాస్ ఆదివారం రాజకీయ ఆర్దిక శాస్త్రం ఆనే పఠ్యాంశాన్ని కార్యకర్తలకు బోధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రపంచం పలు ఆర్ధిక సంక్షోబాలను ఎదురొప్కంటుందని దీని కంతటికి పెట్టుబడి దారి వ్యవస్తే కారనమని ఆరోపించారు. పెట్టుబడి దారులు మానవ శ్రమను కొల్లగొడుతు ప్రకృతి వనరుల్ని సొమ్ముగా మార్చుకుంటున్నారని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలీ, మానవ జాతిని దుర్వ్యవస్తల పాలు జేస్తుందని ఆందుకే మానవ జాతుల మధ్య పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచాన్ని శాసించే ఆమెరికా పెట్టుబడి దారి చేతుల్లో దుర్బర స్తితిని ఆనుభవిస్తుందని ఇది ఆన్ని దేశాలు గమనించాలని అందుకే భారత దేశంలోని వామ పక్ష పార్టీయైన సీపీయం ప్రపంచీకరనకు సరళికృత ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతు పెట్టుబడి దారి కోరల నుంచి పేద వర్గాలను కాపాడుటకు సమరశీల పోరాటాలు నిర్విరామంగా చేస్తుందన్నారు. ఇలాంటి సమరాలకు సురక్షితులైనా కార్యకర్తలను తయారు చేయడం జరుగు తుందన్నారు అందుకే ఈ శిక్షాణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆముదాల మల్లారెడ్డి,దసరి కళావతి,మోకు కనకారెడ్డి,యంవి రమణ,నక్కల యాదవ రెడ్డి,యిర్రిఆహల్య, శశీదర్,గోపి, నారాయణ, వెంకన్న, ఆశోక్‌కుమార్, వెంకట్‌రెడ్డి, రమేష్, వెంకట్రాజం, వెంకటయ్య,రట్నమాల తదితరులు పాల్గొన్నారు.