పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యాదాద్రి,మే17(జ‌నం సాక్షి ): ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. మండల పరిధిలోని తేర్యాల గ్రామంలో రైతుబంధు పథకంలో పాల్గొని మాట్లాడారు. సమస్యలున్న భూముల పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులపై నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పలు రెవెన్యూ దస్త్రాలను పరిశీలించారు. పలువురు గ్రామస్థులు పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణమూర్తి, మండల వ్యవసాయ అధికారిని సుబ్బూరి సుజాత, డీటీ సత్యనారాయణ, ఆర్‌.యాదగిరి, సర్పంచి సత్యనారాయణ, వీఆర్‌వో ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.