పెట్రో ధరలపై బిజెపి కొత్తనాటకం !
పెట్రోలు,డీజిల్‌పై హద్దు పద్దు లేకుండా పెంచుతూ పోతున్న కేంద్రం ఇపపుడు..రాష్టాల్రు పన్నులు తగ్గించు కోవలని చెప్పడం సిగ్గుచేటు. నిజానికి పెట్రోల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్ అదేపనిగా పెట్రో ధరలను పెంచడం దారుణం కాక మరోటి కాదు. ఇప్పుడు స్వల్పంగా ఎక్సయిజ్ సుంకం తగ్గించి ప్రజలకు మేలు చేసామని, విూరూ చేయండని రాష్టాల్రపై బిజెపి ద్వారా ఒత్తిడి తేవడం రాజకీయంకాక మరోటి కాదు. తలుగు ప్రభుత్వాలు ఇదే విషయమై తాజాగా చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. రాకెట్‌లా దూసుకుపోతున్న పెట్రో ధరలకు కారణం ఎవ్వరు. అబద్దాలు చెప్పి పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్‌ను తగ్గిస్తరా..లేదా.. బీజేపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని తెలంగాణ కేసీఆర్ నిలదీశారు. సెస్ తగ్గిస్తే 77కే పెట్రోల్, 67కే డీజిల్ వస్తుందని వివరించారు. బీజేపీ సర్కారు 16 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను ఇష్టం వచ్చినట్లుగా బాదుతూ ధరాఘాతాన్ని మూట గట్టుకున్న మోడీ ప్రభుత్వం గత ఏడేళ్లలో పెంచిన పెట్రోల్ ధరల మొత్తం లీటరుకు 40గా చూడాలి. మేం పన్నులు తగ్గించాం, రాష్టాల్రు విూవాటాగా పన్నులు తగ్గించాలని ధర్మ సందేశం ఇచ్చింది. కేంద్రంలో ఏడేళ్ల బిజెపి పాలనలో వడ్డించిన పెట్రో పన్నులతో పోలిస్తే లీటర్ డీజిల్‌పై రూ.10, లీటరు పెట్రోల్‌పై రూ.5 సెంట్రల్ ఎక్సయిజ్ సుంకం తగ్గింపు పెంచిన దానిలో ఇసుమంత కూడా లేదు. ఇంధన ధరలతో ప్రతి రోజూ అన్ని వస్తువుల ధరలూ దూసుకుని పోతున్నాయి. ప్రస్తుత సుంకం స్వల్ప తగ్గింపును ప్రజలకు దీపావళి కానుకగా బిజెపి అభివర్ణించడం నయ వంచన కాక మరోటి కాదు. బిజెపి వచ్చాక ఇంధన ధరలపై కేంద్ర పన్నులు ఏ స్థాయిలో పెరిగాయో పరిశీలన చేస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పెట్రో ఉత్పత్తుల విక్రయం పై పన్నుల ద్వారా కేంద్రానికి 2014లో రూ.75 వేల కోట్ల ఆదాయం రాగా 2021లో రూ.3.60 లక్షల కోట్లు వచ్చినట్లు అంచనా. ప్రభుత్వం వ్యాపారం చేయడదని నీతులు చెబుతున్న ప్రధాని మోడీ దీనికి సమాధానం చెప్పాలి. కరోనా మహమ్మారి సమయంలోనూ పన్నుల బాదుడు ఆగలేదు సరికదా అప్రతిహతంగా సాగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరగకున్నా ధరలను మాత్రం పెంచకుండా ఉండడం లేదు. 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 109 డాలర్లు కాగా ఇప్పుడు 81 డాలర్లు. కోవిడ్‌లో ఒక్కో రోజు 25`30 డాలర్లకు క్షీణించిన సందర్భాలూ ఉన్నాయి. పెట్రో ధరల పెంపునకు ఇంటర్నేషనల్ రేట్లతో సంబంధం లేదని, ఉన్నదల్లా కేంద్ర కాసుల కక్కుర్తి అని తేలిపోయింది. తన పన్నుల నిర్వాకాన్ని కావాలనే బిజెపి సర్కారు దాచి పెడుతోంది. ఇటీవల కొన్ని రాష్టాల్ల్రో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైంది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్టాల్ర అసెంబ్లీలకు ఎన్నికలు సవిూపిస్తుండటంతో పరాజయం పాలవుతామన్న భయంతో ఇంధన సుంకం స్వల్పంగా తగ్గించిందన్నది అసలు రహస్యం. కొన్ని బిజెపి రాష్టాల్రలో స్వల్పంగా వ్యాట్‌ను తగ్గింపజేసి, ఇదే అదనుగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్టాల్ల్రోనూ పన్నులు తగ్గించాలని రాజకీయం చేస్తోంది. బిజెపి వాదనపై కేరళ వామపక్ష ప్రభుత్వం దీటుగానే స్పందించింది. తాము ఆరేళ్లలో అదనంగా పన్నులేవిూ వేయలేదని తేల్చింది. ఎ.పి ప్రభుత్వం కేంద్ర వ్యవహారాన్ని తప్పుబడుతూనే, తమ ప్రత్యర్ధి టిడిపి హయాంలోని పన్నులపై ఎలుగెత్తింది. టిడిపి నేరుగా బిజెపి కుటిలత్వాన్ని ఎత్తి చూపకుండా కేవలం వైసిపిని దోషిగా పేర్కొంటోందని మంత్రి నాని విమర్శలు చేశారు. ప్రజలను పీక్కుతింటున్న ఇంధన ధరలపై సైతం అసలు దోషి బిజెపిని వదిలేసి, వైసిపి, టిడిపి వాదులాడుకోవడం ప్రజానీకానికి నష్టం కాగలదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇంధన ధరలు పెరగడానికి కేంద్ర విధానాలే కారణం. దేశంలో 1991లో పి.వి హయాంలో మొదలైన సరళీకరణ శకంతో
క్రమంగా చమురు రంగాన్ని మార్కెట్ శక్తులపరం చేయనారంభమైంది. వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు గట్టి ప్రయత్నం జరిగింది. యుపిఎ`1లో ఆ ప్రయత్నం జరిగింది. యుపిఎ`2 ప్రభుత్వం వచ్చాక 2010లో పెట్రోల్‌పై కంట్రోల్ పూర్తిగా ఎత్తేశారు. 2014లో మోడీ రాగానే డీజిల్‌పైనా నియంత్రణ రద్దు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వ కంట్రోల్ ఎత్తేశారో అప్పటి నుండి ఇంధన ధరలు రాకెట్‌లా దూసుకుని పోతున్నాయి. ఇంధన రంగ దిగ్గజాలైన రిలయన్స్ వంటివి సహజ వనరులను, మార్కెట్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి. ఈ విధానమే ఇంధన ధరల పెరుగుదలకు కారణంగగా చూడాలి. ఈ విధానాలను ప్రజలు ప్రతిఘటిస్తేనే ఇంధన ధరల నుండి ఊరట లభించగలదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి.. వాటిని తగ్గించాలని బిజెపి పలు రాష్టాల్ల్రో ధర్నాలు చేయడం రాజకీయ ఎత్తుగడ కాక మరోటి కాదు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా కేంద్రం విధానం ఉంది. ధర తగ్గించాలని ధర్నాలు చేయడంకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు. 2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే సర్కారు పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తేసిన సందర్భంలో చేసిన వాగ్దానం శుద్ద అబద్దమని తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతా యని.. ముడి చమురు ధరలు పెరిగితే వీటి ధరలు పెరుగుతాయని చెప్పింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించడంలేదు. అసలు ధరల వ్యవహారం తమ చేతుల్లో లేదని, అంతా పెట్రో కంపెనీలదే అని కూడా బుకాయించింది. అలా అంటూనే సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తోంది. 2019`20లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎక్సైజ్ సుంకం కింద రూ.47,500 కోట్లు వస్తే.. సెస్సుల రూపంలో రూ.3,15,700 కోట్లు వచ్చింది. సెస్సులు తగ్గిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ని రూ. 60,70 కి ఇవ్వొచ్చు. సామాన్యలపై భారం తగ్గించవచ్చు. కానీ అలా చేయకుండా బిజెపి కొత్త నాటకాలకు తెరతీసింది. రాష్టాల్రపై నెపం నెట్టాలన్న కుట్రలతో ముందుకు సాగుతోంది.