పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి
ఆసిఫాబాద్,డిసెంబర్21(జనంసాక్షి):కవ్వాల్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో సవిూప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్ సూచించారు. కొత్తపల్లి సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. పులుల అడుగుజాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పెద్దపులి సంచరించగా ప్రజలు గమనిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అడవుల్లోకి వెళ్లడం మానుకోవాలని అన్నారు. అలాగే వన్యప్రాణులను సంహరించినా, కలపను అక్రమంగా తరలించినా చర్యలు తప్పవన్నారు.