పెద్ద కొడపగల్ లో టిఆర్ఎస్ ధర్నా

 

జుక్కల్ ,జూలై21,జనంసాక్షి,
కేంద్ర ప్రభుత్వం పాలు ,పాల ఉత్పత్తులపై జిఎస్టీ విధించడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఎంపిపి ప్రతాపరెడ్డి మాట్లాడుతు కేంద్రం ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు.కేంద్రం తెలంగాణా రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు
బిజెపికి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ జాఫర్ ,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.