పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సిద్దిపేట,ఏప్రిల్17(జనంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవన్నారు. అలా డబ్బులు కూడా నెలల తరబడి రాకపోయేవనీ, ఇప్పుడు వారం రోజుల్లోనే డబ్బులు ఇస్తున్నామని ఎ/-మెల్యే రామలింగారెడ్డి చెప్పారు.ప్రతి గింజనూ సర్కారే కొంటుందని స్పష్టం చేశారు. గ్రేడ్-ఏ, సాధారణ రకం వరిధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా క్వింటాల్‌కు రూ. 30 బోనస్ ఇస్తుందని వెల్లడించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచించారు.