పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఓం ప్రకాష్ పాటిల్
ఝరాసంగం సెప్టెంబర్ 21 (జనంసాక్షి) ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను సర్పంచ్ ఓం ప్రకాష పాటిల్ పంపిణీ చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనరాజ్, వార్డు సభ్యులు , గ్రామస్తులు పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.