పెన్షన్ కోసం టీచర్ల ఆందోళన
నల్లగొండ,సెప్టెంబర్26(జనంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీచర్ యూనియన్ల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2004 సెప్టెంబర్ నుంచి నియామకమైన ఈ విధానం రద్దు చేయాలన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. దీనిపై ఆయా పార్టీల నేతలు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో దీనిని తమ
మ్యానిఫెస్టోల్లో చేర్చాలని అన్నారు.