పెరిగిన ధరలు,ప్రకృతి కన్నెర్రతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరం
ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్
జనం సాక్షి నర్సంపేట
పాలకుల విధానాల్లో భాగంగా పెరిగిన పంటల ఉత్పత్తి ఖర్చులతో అధిక వర్షాలతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ప్రతిరోజు ఏదో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటల సందర్శనలు జరిపి రైతాంగ సమస్యలపై స్థానిక వ్యవసాయ శాఖ ఏవోలకు 28 29 తేదీల్లో, జేడీలకు ఉన్నతాధికారులకు 31వ తేదీన వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈరోజు అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకెఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన్ లో జరిగింది.
ఈ సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని బహిరంగంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో దొడ్డిదారిన అమలుకు కోరుకుంటున్నారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పీఎం ప్రణామ్ పేరిట ఎరువుల సబ్సిడీని ఎత్తివేసేందుకు విధానాల రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ దోపిడిని విస్తృతపరిచేందుకు కార్పొరేట్ శక్తులకు మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం అప్పుల పాలే ఆత్మహత్య చేసుకుంటున్న రుణాలు మాఫీ చేయని పాలకులు పెట్టుబడిదారుల వేల కోట్ల రూపాయలు మాత్రం మాఫీ చేయడం దారుణమన్నారు. అలాగే దేశంలో ప్రధాన పంటలైన పత్తి వరి మొక్కజొన్న ఆహార ఉత్పత్తులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచకుండా కొన్ని పంటలకు అరాకుర మద్దతు ధర పెంచడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని విమర్శిస్తున్నట్లు కనిపించిన ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతాంగం అధిక వర్షాలతో అననుకూల వాతావరణ పరిస్థితుల్లో పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు కానీ మునుగోడు ఉప ఎన్నికపై మాత్రం అత్యంత శ్రద్ధ కనపరిచి ఓట్ల రాజకీయం చేయబడుతున్నారన్నారు.
కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులు పంటలు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రతిరోజు ముగ్గురు నలుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయినా పాలకులకు పట్టింపు లేకపోవడం రైతుల పట్ల వారి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ చర్చించి రైతాంగ పంటల సందర్శన చేసి రైతుల స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వ్యవసాయ అధికారులకు, 31న ఉన్నతాధికారులకు విన్నవించనున్నట్లు తెలిపారు.
అలాగే మార్కెట్ దోపిడిని రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1,2 తేదీలలో పర్యటించి ఆందోళనలు చేపట్టాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు.
పాలకులు ఇప్పటికైనా దేశాన్ని కాపాడేందుకు రైతాంగని రక్షించాలని అందుకు తగిన విధమైన రైతాంగని ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లేపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగతి సాంబయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య, రాష్ట్ర నాయకులు సుధీర్ మానయ్య సింగతి మల్లికార్జున్ నాగేల్లి కొమురయ్య వరికెల కిషన్ అంజయ్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు.