పెరిగిన ధరలు కనుగుణంగా మిస్ చార్జీలు పెంచాలి.
తొర్రూర్ 26 ఆగస్టు (జనంసాక్షి )దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు )మహబూబాబాద్ జిల్లా నాయకులు భూక్య సంతోష్, బానోతు శేఖర్ లు అన్నారు.పిడిఎస్సి ఆధ్వర్యంలో నేడు తొర్రూర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో రాఘవరెడ్డికి వినతిపత్రం అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ హాస్టల్స్ గురుకులాలలో లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. వారికి పెరిగిన ధరలు కనుగొనంగా మేస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని వారు కోరారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయింపులు పెంచకుండా విద్యాసంస్థలలో కనీస సౌకర్యాలు మెరుగుపరచకుండా నాణ్యమైన విద్య ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్స్ లలో కనీస సౌకర్యాలు కరువనాయని యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు. హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్ వర్కర్ తదితర పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. లక్షలాదిమంది పేద మధ్య తరగతి విద్యార్థులకు కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉందని వాటిని వెంటనే విడుదల చేయాలని సంతోష్ శేఖర్లు కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలామంది పేద విద్యార్థులు చదువులు మానుకొని ఇతర పనులు వృత్తులు చేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పై డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్రవ్యాప్త పోరాటంగా మారుస్తామని వారు హెచ్చరించారు.స్పందించిన ఎమ్మార్వో మాట్లాడుతూ మీరిచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెంకన్న నవీన్ గాంధీ శేఖర్ ప్రవీణ్ అర్జున్ సందీప్ రాజేందర్ జస్వంత్ వీరన్న తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.26