పెరిగిన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): శాసన మండలి ఎన్నకిల్లో ఓట్ల సంఖ్య పెరిగింది. తుదిగడువును ఫిబ్రవరి 19 వరకు పెంచడంతో మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 18వేల 500 వరకు పెరిగారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగానే పెరిగింది. తొలుత నిర్ణయించిన ఓటర్ల నమోదు తుది గడువు అనంతరం ఎన్నికల సంఘం తిరిగి ఈ నెల 19 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. దీంతో అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. మొదట 2,62,582 మంది ఓటర్లుండగా 19 వరకు నమోదు అనంతరం 18,554 మంది ఓటర్లు పెరిగారు. వరంగల్‌లో 1,04,362, ఖమ్మంలో 84,284, నల్గొండలో 92,490 మంది ఓటర్లున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరంగల్‌లో 144, ఖమ్మంలో 123, నల్గొండలో 133 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కవిూషన్‌ ఆదేశాల ప్రకారం వెయ్యి మంది ఓటర్లకు మించిన పోలింగ్‌ కేంద్రంలో అదనపు పోలింగ్‌ బూతు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో 273 పోలింగ్‌ కేంద్రాలుండగా 127 అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించారు.