పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి.

PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్ పల్లి రాము

తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలనీ పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్ పల్లి రాము డిమాండ్ చేశారు.

మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో పిడిఎస్ యు అధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్యమ సమయంలో, అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు కానీ తెలంగాణా ఏర్పడి నేటికీ 8 సవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నది. SC,BC, మైనార్టీ సక్షేమ హాస్టల్స్ లలో సమస్యలు విలయతాండము చేస్తున్న పరిస్థితి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం 3వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు 950, కాస్మోటిక్ చార్జీలు 55,రూ” ఇస్తున్నారు. 8,9, 10వ తరగతి విద్యార్థులకు మెస్ చార్జీలు 1100, కాస్మోటిక్ చార్జీలు 75 రూ” ఇస్తున్నారు. ఇంటర్, ఆపై ఉన్నత చదువు విద్యార్థులకు మెస్ చార్జీలు 1500 ఇస్తున్నారు. కాని ఈ మిస్ చార్జీలు విద్యార్థులకు ఏమాత్రం సరిపోక పోవడం వల్ల పౌష్ఠిక ఆహారం సరిగా అందక అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టీ పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మిస్ చార్జీలను 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు 950 నుండి 3000 కు పెంచాలి. కాస్మోటిక్ చార్జీలు 55 నుండి 500 వరకు పెంచాలి.8,9,10వ తరగతి విద్యార్థులకు 1100 నుండి 3500 కు పెంచాలి. కాస్మోటిక్ చార్జీలు 75 నుండి 500 వరకు ఉంచాలి. ఇంటర్ ఆపై విద్యార్థులకు 1500 నుండి 3500 లకు పెంచాలి, ప్యాకెట్ మనీ కోసం 1000 ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, నేడు ఇస్తున్న అరా-కొర మె స్ చార్జీల తో పౌష్టిక ఆహారాన్ని ఎలా విద్యార్థులకు అందిస్తారని వారు ప్రశ్నించారు. అద్దె భవనలలో కొనసాగుతున్న హాస్టల్స్ కు సొంత భవనాలు కట్టించాలి. ప్రతి హాస్టల్ కు ఒక్క ANM ను నియమించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ హాస్టల్ కు బెడ్స్, బెడ్ సీడ్స్, ట్రంక్ బాక్స్ లు. బకెట్స్, ప్లేట్స్, ప్రతీ సంవత్సరం రెగ్యులర్ గా ఇవ్వాలి, నోట్ బుక్స్ తగినన్ని ఇవ్వాలి. రెగ్యులర్ వార్డెన్ ను నియమించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చెయ్యాలి. కాస్మోటిక్ చార్జీలను పెంచి సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
అనంతరం రాస్తారోకో దగ్గరికి వచ్చిన మక్తల్ తహశీల్దార్ కు డిమడ్స్ తో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు ఎజీ బుట్టో PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. భాస్కర్, నారాయణ పేట జిల్లా ప్రధానకార్యదర్శి అజయ్ , జిల్లా సహయ కార్యదర్శి హనుమంతు, బాలు, జిల్లా నాయకులు జయమ్మ, అజయ్, అనిల్, శేకర్, శివరాం, సుదర్శన్, మరియు హాస్టల్ విద్యార్థులు, పాల్గొన్నారు…