పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.11 కోట్లు స్వాహా
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ మహిళ రూ.11 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అతని వద్ద నుంచి పలుమార్లు రూ.11 కోట్లు తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసుకున్న వీరారెడ్డి పోలీసులను అశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.6కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.