” పేదరికం విద్యార్థులకు శాపం కాకూడదు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 18 ( జనంసాక్షి): పేదరికం, కటిక దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థికి శాపంగామారి విద్యకు దూరం కాకూడదని, ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని శేరిలింగంపల్లి బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ను సందర్శించి వసతులు మరియు మౌలిక సదుపాయాలు గురించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం గజ్జల యోగానంద్ మాట్లాడుతూ పురుగుల పట్టి ముక్కిపోయిన బియ్యాన్ని సరఫరా చేస్తున్న తెరాస ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం లో ఇవే బియ్యాన్ని పేద విద్యార్థులకు వండి పెడుతున్నరు.  క్లాస్ రూమ్ లో పగిలిన బోర్డును మార్చలేని స్థితిలో తెరాస ప్రభుత్వం వున్నది అని ఆయన అన్నారు.సుమారు 800 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్న, ఒక్కరు కూడా స్కావెంజర్ లేకపోవడంతో మరుగుదొడ్లు శుభ్రంగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు,మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే కేటీఆర్ గారు నేను దత్తత తీసుకుంటాను అని చెప్పడం, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు వెళ్లి అక్కడ పనిచేయడం కాదు, 800 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్న జిల్లా పరిషత్ పాఠశాలలో కనీసం ఒక స్కావెంజర్ ని ఏర్పాటు చేయలేని మీరు తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని అన్నారు.ఈ కార్యక్రమంలోడివిజన్ అధ్యక్షుడు నర్సింగ్, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, కళ్యాణ్ భరద్వాజ్ చంద్రశేఖర్ రెడ్డి,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..