*పేదల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయం.

*తెలంగాణ రాష్ట్రం సమితి అంటే నమ్మకం.
*భారతీయ జనతా పార్టీ అంటే అమ్మకం.
*- ఎమ్మెల్యే గండ్ర.
చిట్యాల28(జనంసాక్షి) పేదల అభ్యున్నతే ప్రభుత్వ ద్వేయమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని  గోపాలపురం, కొత్తపేట, ముచినిపర్తి,చల్లగారిగ,జూకల్ గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొత్త పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలనే సంకల్పంతో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తాం.తెలంగాణ రాకముందు దరఖాస్తు ఇచ్చి దండంపెట్టిన గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు.కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి.స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణ రాకముందు మన అందరం ఉన్నాం కానీ… అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని మనస్సు నాటి పాలకులకు రాలేదు.
పక్కనుండి గోదారమ్మ పారుతున్న ఇక్కడి భూములకు చుక్క నీరు రాని పరిస్థితి.గత పాలకులు ఇక్కడి పంట భూములను ఎండబెట్టి సాగునీటిని తీసుకెళ్లిన దుస్థితి.ఇక్కడి రైతాంగం సాగు చేసేందుకు వర్షం చుక్క కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి.నీరుంటే కరెంటు లేక కరెంటు ఉంటే నీరు లేక సగం భూమిని సాగుచేసిన రోజులు.ఉపాధి కోసం ఇక్కడ యువత ముంబై దుబాయ్ వలస పోయిన దుస్థితిగత 70 సంవత్సరాల సమైక్య పాలనలో పాలకులు ప్రభుత్వాలు మారారే తప్ప… ఇక్కడి వారి జీవితాలు మారలేదు సాగు పెట్టుబడి కోసం షావుకారి దగ్గర అప్పులు చేసి… పంట దిగుబడి రాక… చివరకు భూములనమ్ముకున్న దుస్థితి ఇక్కడి రైతాంగానిది.ఇందుకోసమే మన తెలంగాణ మనకు కావాలని పోరాడి సాధించుకున్నాం.తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు కెసిఆర్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలనలో ఇక్కడి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి.వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం.సాగు పెట్టుబడి కోసం రైతుబంధునిస్తున్నాం.గతంలో ఎరువుల కోసం రైతన్నలు లాటి దెబ్బలు తిన్న పరిస్థితులు.కానీ స్వయం పాలనలో రైతన్నలకు ఎరువుల సమస్య లేకుండా పోయింది.రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులతో పాటు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి  పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు.అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనే మనసు అక్కడి పాలకులకు రావడం లేదు.కాలేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య పరిష్కరించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది.
గత ప్రభుత్వ పాలనలో 75 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు.కొత్తగా పెన్షన్ కావాలంటే,
మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి.స్వయం పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నాం.ఈ నూతన పెన్షన్లను సైతం వచ్చే నెల నుండి మీ మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.ఆసరా పెన్షన్లతో అవసరాలకు ఇతరుల పై ఆధార పడకుండా లబ్ధిదారుల ఆత్మగౌరవం పెరుగుతోంది.ఎన్నికలు వస్తె కొత్త కొత్త పార్టీలు రాబోతున్నాయి.కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలు. అలాంటి పార్టీలు మనకు అవసరమా.ఆయా పార్టీల మాయమాటలు నమ్మి గోసపడొద్దు.ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే,మీ బాగోగులు చూసే ఏకైక పార్టీ టిఆర్ఎస్ మాత్రమే.సీఎం కేసీఆర్ కు దీవెనార్తులు ఇచ్చి నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆశీర్వదించండని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, ఎమ్మార్వో శ్రీనివాస్ ఎంపీడీవో రామయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు,సర్పంచ్ లు దుప్పటి రజిత శ్రీనివాస్, నందికొండ కవిత పాపిరెడ్డి,కర్రె మంజుల అశోక్ రెడ్డి, పుట్టపాక మహేందర్, ఎంపీటీసీ లు పీసరి సుశీల, జంబుల తిరుపతి , కో ఆప్షన్ మెంబర్ రాజ్ మహ్మద్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.