పేదల ఆరోగ్యం పట్ల కోటగిరి వైద్య సిబ్బంది సుస్తి. సక్కగ లేని కోటగిరి సర్కార్ దవఖాన. ఒకవైపు సిబ్బందిి కొరత. మరోవైపు అధికారుల నిర్లక్షం
కోటగిరి అక్టోబర్ జనం సాక్షి:-పేదల ఆరోగ్యం పట్ల సుస్థిగా వ్యవహరిస్తున్న కోటగిరి వైద్య సిబ్బంది.ప్రజారోగ్యం గాలికొదిలేసిన ఘటనలు కోటగిరిలో రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.
పి.ఎచ్.సి స్థాయి నుండి సి.ఎచ్.సి సెంటర్ గా అప్గ్రేడ్ అయిన కోటగిరి ముప్పై పడకల హాస్పటల్ సుస్తిగా తయారైందని ప్రజలు వాపోతున్నారు.కోటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో గత వారం రోజుల క్రితం నార్మల్ డెలివరీ విషయమై వైద్య సిబ్బంది వల్ల శిశువు మరణించడం పట్ల సంభందిత వైద్య సిబ్బంది,అధికారులు తేరుకున్నట్లు అగుపిస్తలేదనే ప్రశ్నలు అవుననే అనిపిస్తున్నాయి.గత వారం రోజుల క్రితం హంగర్గ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ కాన్పు నిమిత్తం కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది ఆమెకి సరియైన వైద్యం అందించడంలో దవాఖాన సిబ్బంది విఫలం కావడంతో శిశువు మరణించాడు
.ఈ ఘటనపై ఇప్పటి వరకు ఉన్నత అధికారులు విచరణ చేసిన దాఖాలైతే కనిపించటం లేదు.గవర్నమెంట్ దవాఖానలో డెలివరీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేయగా,ఇక్కడి సిబ్బంది మాత్రం డేలివరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు
న్నారనే ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నయి.కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న వైద్య సిబ్బంది కొరత ఒకవైపు అయితే మరోవైపు ఉన్న సిబ్బంది విధులపట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితనం గురువారం రోజున స్పష్టంగా కనిపించింది.కొందరు వ్యక్తులు చికిత్స నిమిత్తం గురువారం రోజు ఉదయం కోటగిరి హాస్పటల్ కు చేరుకోగా అక్కడ విధుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…గత కొన్ని రోజుల క్రితం శిశువు మృతి పట్ల సంబంధిత సిబ్బంది,అధికారులు అలర్ట్ కావల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సిగ్గుచేటనీ ఉన్నత అధికారులు,సిబ్బందిపై ప్రజలు మండిపడుతున్నారు.నిన్న ఇద్దరు వ్యక్తులు బైకు పైనుండి క్రింద పడడంతో వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ సిబ్బంది ఒక్కరు కూడా విధులలో లేకపోవడంతో చేసేది ఏమిలేక గాయాలైన వ్యక్తులు స్వయంగా ఆస్పటల్లో ఉన్న దోబి వ్యక్తితో హాస్పటల్ మందులతో చేతులు, కాళ్ళకు ఫస్ట్ ఎడ్ చేసుకున్నారు.అలాగే ఇంకొందరు నొప్పు భాదతో,మరొకరు గర్భంతో 9 నెలలు నిండి నొప్పులతో నార్మల్ డెలివరీ కోసం హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ విధుల్లో ఎవ్వరు కూడా సిబ్బంది లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య శాఖపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పేదల ఆరోగ్యంపై ప్రాధాన్యత కల్పిస్తూ పలు రకాల మందులు, సదుపాయాలు, కార్యక్రమాలు కల్పిస్తున్నాస్థానిక,ఉన్నతాధి కారులు కోటగిరి ఆస్పటల్నీ సమస్యల నిలయంగా మార్చడం శోషణీయం.ఇకనైనా కోటగిరి దవాఖానను సమస్యల వలయం నుండి తొలగించి,హాస్పటల్కి అవసరమయ్యే సిబ్బందిని నియమించి పేద రోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Attachments area