-->

పేదల “ఆసరా” కిరణం కెసిఆర్

 

* అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

* జిల్లాలో కొత్త ఆసరా పింఛన్లు 31822

* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
పేదల ఆసరా కిరణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీసీ సంక్షేమ పౌరసరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్, గోపాల్ పూర్ ,దుర్శేడ్ గ్రామాలకు చెందిన 596 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.జిల్లాలో ఇప్పటి వరకు 1,15,000 పెన్షనర్లు ఉండగా కొత్తగా 31,822 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ రాకముందు పింఛను మంజూరు కోసం దరఖాస్తు ఇచ్చి దండంపెట్టిన గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదని,కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదన్నారు.అందరి పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు.
స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. బొమ్మకల్ లో గతంలో 540 లబ్ధిదారులుంటే కొత్తగా 319 మందికి… దుర్శేడ్ లో 402 మంది లబ్ధిదారులుంటే కొత్తగా 224 మందికి గోపాల్ పూర్ లో 284 మంది ఉంటే కొత్తగా 53 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు
57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తామని అన్నారు.
తెలంగాణ రాకముందు మన అందరం ఉన్నాం కానీ,అర్హులైన వారికి పెన్షన్ ఇచ్చేందుకు మనస్సు నాటి పాలకులకు రాలేదన్నారు.
గతంలో ఇక్కడ సీఎంగా చేసిన ఆంధ్ర పాలకులు ఢిల్లీ పార్టీలు చెప్పిన మాటలే వినేవారు
పక్కనుండి గోదారమ్మ పారుతున్న ఇక్కడి భూములకు చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదన్నారు. బాగుందా గత పాలకులు ఇక్కడి పంట భూములను ఎండబెట్టి సాగునీటిని తీసుకెళ్లిన దుస్థితి ఉండేదన్నారు.
ఇక్కడి రైతాంగం సాగు చేసేందుకు వర్షం చుక్క కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. నీరుంటే కరెంటు లేక కరెంటు ఉంటే నీరు లేక సగం భూమిని సాగుచేసిన రోజు ఉండేవని,ఉపాధి కోసం ఇక్కడ యువత ముంబై,దుబాయ్ వలస పోయిన దుస్థితి అని,
గత 70 సంవత్సరాల సమైక్య పాలనలో పాలకులు ప్రభుత్వాలు మారారే తప్ప, ఇక్కడి వారి జీవితాలు మారలేదన్నారు ఎవరు సాగు పెట్టుబడి కోసం షావుకారి దగ్గర అప్పులు చేసి పంట దిగుబడి రాక, చివరకు భూములనమ్ముకున్న దుస్థితి ఇక్కడి రైతాంగానిదని అన్నారు. ఇందుకోసమే మన తెలంగాణ మనకు కావాలని పోరాడి సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు కెసిఆర్ ఇప్పుడు సీఎంగా ఉన్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలనలో ఇక్కడి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అన్నారు. వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. సాగు పెట్టుబడి కోసం రైతుబంధు
ఇస్తున్నామని తెలిపారు.గతంలో ఎరువుల కోసం రైతన్నలు లాటి దెబ్బలు తిన్న పరిస్థితులు కానీ స్వయం పాలనలో రైతన్నలకు ఎరువుల సమస్య లేకుండా పోయిందని,రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులతో పాటు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య పరిష్కరించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.గత కాంగ్రెస్ పాలనలో 75 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు
కొత్తగా పెన్షన్ కావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన ఉండేదన్నారు. నూతన పెన్షన్లను సైతం వచ్చే నెల నుండి మీ మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం అన్నారు.
ఆసరా పెన్షన్లతో అవసరాలకు ఇతరుల పై ఆధార పడకుండా లబ్ధిదారుల ఆత్మగౌరవం పెరుగుతోందిని,కాంగ్రెస్ ప్రభుత్వం 75 రూపాయల పెన్షన్ ఇస్తే తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెండు వేలు, మూడు వేల పెన్షన్ ఇస్తున్నామని,అన్నం పెట్టిన సీఎం కెసిఆర్ ను మరువద్దని,పేదల బాగోగులను పట్టించుకునే నేత సీఎం కెసిఆర్ అన్నారు.
ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని,సీఎం కేసీఆర్ కు దీవేనార్తులు ఇచ్చి నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆశీర్వదించండి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరీమాగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, కరీంనగర్ ఎంపీపీ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.