పేదల పాలిట సంజీవని సీఎం రిలీఫ్ ఫండ్.

మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి)
పేదల పాలిట సంజీవినిగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిందని మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలాని కి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు వైస్ ఎంపీపీ రమేష్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబాలతో కలిసి రూ.1 లక్ష 3 వేల రూపాయల విలువైన చెక్కులను (రాస్నం గ్రామానికి చెందిన కిష్టప్పకు రూ.35000,సంగం కుర్దు గ్రామానికి చెందిన రమేష్ రూ.44000, నాగసముందర్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి  రూ.24000) అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు  తూ ఆపత్కాలం లో ఆదుకునే ఆపద్బంధువుగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచింద న్నారు. మండల పరిధిలో ఎవరైనా ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, వైద్య ఖర్చులకోసం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిరుపేదలె వరూ కూడా ఏ విషయంలో ఇబ్బంది పడడం లేదన్నారు. మండల పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గాన్ని చూపిస్తా నన్నారు. మండల అభివృద్ధి ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా నన్నారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం లో పాటు యాలాల మండలం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందన్నారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తానన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లాలు ముదిరాజ్, కృష్ణ, రఘు రెడ్డి తదితరులున్నారు.