పేదల బియ్యం పెద్దల పాలు…

కొనుగోలు 10 రూపాయలు, అమ్మకం 45 రూపాయలు..
– శాఖల సమన్వయం తిలా పాపం తలా పిడికెడు..
– దోమకొండ లో 30 క్వింటాళ్ల20 కిలోల బియ్యం పట్టుకున్న ఎస్సై సుధాకర్..
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్2 (జనంసాక్షి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో నిరుపేదల కోసం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తుండగా క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బందితో చేతివాటం తో రైతు మిల్లర్లు అధికారులు కుమ్మక్కై పేదలకు రావాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిపై వివిధ రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ కేసు నమోదు చేస్తూ సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా గరి చేస్తున్నారనేది సామాన్యుడి ఆవేదన, ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించి రీసైక్లింగ్ చేసి, ఒక్క రూపాయికే కిలో బియ్యం ను ,45 రూపాయలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇది సత్యం అయినప్పటికీ పిర్యదుచేయడానికి సామాన్య ప్రజానీకం వెనుకడుగు వేస్తున్నారు అంటే చీకటి మాఫియా పెత్తనం చెలాయిస్తున్నది అన్న విషయం అర్థమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ ఎస్ ఐ సుధాకర్ 30 క్వింటల 20 కిలొలకు పైగా బోకెరొ వాహనాన్ని పట్టుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వగా పీడీఎస్ బియ్యం అని నిర్ధారించారు. తలమడ్ల గ్రామానికి చెందిన ఎర్రం సురేష్, జంగాలపల్లి గ్రామానికి చెందిన కె శ్రీనివాస్ లు మండలంలోని వివిధ గ్రామాల్లో పిడిఎఫ్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.