పేదల భూమి లాక్కోవడం సరైంది కాదు – ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మైసగల్ల బుచ్చేంద్ర

హత్నూర (జనం సాక్షి)
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం పేదల భూమి లాక్కోవడం సరైంది కాదని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మైసగల్ల బుచ్చేంద్ర అన్నారు.మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన పేద రైతులు జక్క మల్లేశం,గొంట్యాల రాందాస్,గొంట్యాల వీరేశం,బండ పోచమ్మలకు సంబంధించిన భూమిని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి దౌర్జన్యంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అధికార పార్టీ నాయకులు పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారి భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని వారు మండిపడ్డారు.పేద రైతుల భూముల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిక చేశారు.కార్యక్రమంలో తెలంగాణా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకులు మీనం పల్లి శ్రీశైలం,మాల మహానాడు జిల్లా కార్యదర్శి గొల్లపల్లి ఆంజనేయులు, మండలాద్యక్షుడు రాజీవ్ గాందీ,బిఎస్పీ నాయకులు పొట్లగల్ల ప్రవీణ్,కాసాల విఠల్,అనిల్,దాసు,బండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area