పేదల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

ఇంటింటా ప్రచారంలో రేఖానాయక్‌
నిర్మల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మహకూటమి నాయకులు వస్తున్నారనీ, వారిని నమ్మవద్దని ఖానాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రేఖానాయక్‌ కోరారు.టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనీ, మరో సారి తననను ఆశీర్వదించాలని అన్నారు.
టీఆర్‌ఎస్‌ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓట్లు వేయాలని రేఖానాయక్‌ పేర్కొన్నారు.  వివిద పార్టీలకు చెందిన మహిళలు, యువకులు, టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి రేఖానాయక్‌ కండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నాలుగు సంవత్సరాల్లో జరిగిన ప్రగతిని వివరించారు. టీఆర్‌ఎస్‌ పాక్షిక మ్యానిఫెస్టో కరపత్రాలను పంచుతూ కేసీఆర్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఓట్లు అభ్యర్థించారు. కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి ప్రజల గురించి ఇంతలా ఆలోచించలేదని, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నపుడు ప్రజలను మోసం చేశారన్నారు.  మరోసారి మాయమాటలు చెబుతూ మభ్య పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, ప్రజలంతా ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ను ఒక్కడిని ఎలాగైనా ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సిద్దాంతాలు, విధానాలను పక్కనపెట్టి ఏకమయ్యాయన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని నాటి పాలకులు హెచ్చరికలు చేశారన్నారు. కానీ నేడు కోతలు లేని కరెంటును నిరంతరంగా సరఫరా చేస్తున్నామన్నారు.
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పేద కుటుంబాలు సంతోషంగా తమ ఆడబిడ్డల పెళ్లి చేస్తున్నారన్నారు.