పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ. జనం సాక్షి
పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.
ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గంలో అడవిదేవులపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 540 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ రాకముందు పింఛను మంజూరు కోసం దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. అనంతరం అడవిదేవులపల్లి గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ధనావత్ బాలాజీ నాయక్, జడ్పీటీసీ కుర్రా సేవ్యా నాయక్, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, స్థానిక సర్పంచ్ కొత్తా మరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుర్రా శ్రీను నాయక్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎండీవో షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.