పేదల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూలై19(జ‌నం సాక్షి): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని, గ్రావిూణ ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్‌ స్థాయి దవాఖానల్లో చికిత్స చేయించుకున్న బాధితులు, సంబంధిత బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు. గ్రావిూణ ప్రాంతంలోని బడుగు బలహీ న వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆడపడుచులకు వరంగా మారాయన్నారు. ఈ పథకంలో అమల్లో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయన్నారు. విద్య, వైద్యరంగంతో పాటు అన్ని రంగాల్లో మార్పులు చేసి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చేసి రైతులకు రైతుబంధు పథకంతో పాటు రైతుబంధు బీమా పథకాన్ని కల్పించిందన్నారు. గ్రావిూణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఇండ్లులేని వారిని గుర్తించి డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఆదుకుంటున్నామని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ఒక శ్మశాన వాటికలను మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతుందన్నారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మరమ్మతులు చేపట్టి రైతుల భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

———-