పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం

 

ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్‌ కుటుంబాల్లో జన్మించే సుమారు 2.70లక్షల శిశువులను ఈ పథకం పరిధిలోకి తేనున్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో ఆడ శిశువు పేరిట రూ.21,200ప్రభుత్వం బీమా కంపనీవద్ద జమ చేస్తుంది. ఆ శిశువులకు 18ఏళ్లు వచ్చాక లక్ష అందజేస్తారు. పథకంలో సోనియాగాంధీ పేరు స్ఫురించేలా ‘లేక్‌సోనియాచి’ అని నామకరణం చేశారు. ఆడశిశువు జన్మించిన ఏడాదిలోపే పంచాయితీ, మున్సీపాలిటీల్లో రిజిస్టర్‌ చేయించాల్సి ఉంటుంది.