పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్
– తొర్రూరు ఎంపీపీ,జడ్పీటీసీలు అంజయ్య,శ్రీనివాస్
తొర్రూరు 30 సెప్టెంబర్( జనంసాక్షి )
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన గొప్ప అద్భుతమైనటువంటి పథకం కళ్యాణ లక్ష్మి అని తొర్రూరు ఎంపీపీ తూర్పాటి అంజయ్య,ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ లు అన్నారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పేద,మధ్యతరగతి సుమారు 77 లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక తహసిల్దార్ వేంరెడ్డి రాఘవరెడ్డి తో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో కేసీఆర్ కానుకగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.ప్రజా సంక్షేమ పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలిచిందని,అన్ని వర్గాల ప్రజలకు అండదండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి,ఆర్ ఐ మురళీకృష్ణ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే అంకుస్, ఎంపిటిసిలు ధర్మారపు కిరణ్,మెరుగు మాధవి రమేష్, సర్పంచ్ లు జూరెడ్డి రవీందర్ రెడ్డి, మోత్కూరి రవీంద్ర చారి,శీలం లింగన్న గౌడ్, సట్ల నాగలక్ష్మి, పందుల యాకయ్య,పాడ్యా రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
—