పేదింటి బిడ్డకు పెద్దన్న కేసీఆర్ 

నిరుపేద యువతుల కోసమే కల్యాణ లక్క్ష్మి, షాదీ ముబారక్
మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా 250 మంది లబ్ధిదారులకు
రూ.1కోటి 64లక్షల 87వేల 980 చెక్కుల పంపిణీ
సిద్ధిపేట,గజ్వేల్ అక్టోబర్ 18(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ముందు చూపుతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రవేశ పెట్టడంతో మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్ లో బుధవారం కళాభిరామ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లికి ఏ తండ్రికి భారం కాకూడదని సీఎం పథకం ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ పెద్దన్నయ్యలా నిలిచి సాయం అందిస్తున్నారని., దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం అభినందనీయమని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. పెళ్లికి 15 రోజుల ముందు కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ పిల్లల పెళ్ళిళ్ళకు నిరుపేదలు ఇబ్బందులు పడొద్దనే సదుద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి బాగా చేశామని, ఆసుపత్రులలో కేసీఆర్ కిట్ అందిస్తున్నట్లు  సంక్షేమ పథకాల గురించి వివరించారు. హరిత హరంలో భాగంగా ప్రతి మనిషి 5 చెట్లు కాపాడుతామని మీరు ప్రతిజ్ఞ చేయాలని మంత్రి కోరారు. అందరూ కలిసి సమిష్టిగా చేస్తేనే, ఒక బాధ్యతగా తీసుకుంటేనే రేపటి మన పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉంటారని., వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మనమంతా సమిష్టిగా కలిసి చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని తెలిపారు.
ఈ మేరకు గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్ మండలం-101 మందికి రూ.61లక్షల 39వేల 756, జగదేవ్ పూర్ మండలం-23 మందికి రూ.15లక్షల 58వేల 856, ములుగు మండలం-6మందికి రూ.3లక్షల 30వేల 116, కొండపాక మండలం-104 మందికి రూ.73లక్షల 53వేల 860, వర్గల్ మండలం-8 మందికి రూ.5లక్షల 76వేల 812, మర్కూక్ మండలంలోని 8 మందికి రూ.5లక్షల 28వేల 580 రూపాయల చొప్పున మొత్తం నియోజకవర్గంలో 1కోటి 64లక్షల 87వేల 980 రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు. వీటిలో ఈ యేడు ఉగాది పండుగకు ముందు గతంలో రూ.51వేల చొప్పున 95 మంది లబ్ధిదారులకు రూ.48లక్షల 45 వేలు ఉండగా,  కొత్తగా ప్రతి లబ్ధిదారుడికి ₹.75, 116 అమలు చేసిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో 155 మందికి రూ.1కోటి 16 లక్షల 42వేల 980 రూపాయలను నిరుపేద కుటుంబాల్లో కల్యాణ కాంతిని నింపేలా చెక్కుల రూపేణ ప్రభుత్వం తరపున అందజేయడం జరుగుతున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ భూంరెడ్డి, గడా ప్రత్యేక అధికారి ఎం.హన్మంతరావు, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ ఛైర్మన్ భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు