పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి.
జులై 13(జనంసాక్షి)
పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ లోని ఎమ్మెల్సీ నివాసంలో మ‌హేందర్ రెడ్డి తాండూరు డివిజ‌న్‌లోని బషీరాబాద్ మండలం గ్రామానికి చెందిన నర్సింగ్ కు, 60,000 రూపాయలు తాండూర్ టౌన్ లో నాగమణి కి రూ.60,000
అశోక్ కొర్విచేడ్ గ్రామానికి చెందిన,56,000
మహిపాల్ మల్లారెడ్డి గ్రామం, అగ్గనూర్ 38,500/దామర్చెడ్ గ్రామానికి చెందిన జాలిఖా అనే మహిళకు, ల‌బ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, జిల్లా ప్రణాళిక మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, బషీరాబాద్ మండలం పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రామ్ రెడ్డి, మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ సిద్రలా శ్రీనివాస్, సీనియర్ నాయకులు బీదర్ రాజ్ శేకర్, రాష్ట్ర యూత్ కార్యదర్శి రఘు అశోక్ ముదిరాజ్ ,శ్రీకాంత్ రెడ్డి, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, మంగలి శ్రీనివాస్, రంజిత్, అశోక్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.