పేద కుటుంబానికి పెద్ద ఆపద.

బెల్లంపల్లి, ఆగస్టు2, (జనంసాక్షి)
పేద కుటుంబానికి పెద్ద ఆపద ఎదురైంది. మానవత్వం గల వ్యక్తులు తలో కొంత సాయం చేసి తమ ఆశల దీపాన్ని నిలబెట్టాలని ఆపేద కుటుంబం ఆశతో ఏడుతుచూస్తుంది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బూరం శంకరి (పశు వైద్యశాల) లో చిన్న ప్రవేటు ఉద్యోగం తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అతని కూతురు బూరం స్వాతి పెద్దపల్లి లోని ట్రినిటీ కాలేజ్ లో ఫారమెడికల్ సైన్స్ చదువుతుంది. మంగళవారం వరంగల్ లో ఫార్మా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయటానికి తన స్నేహితులతో కలిసి వెళ్తుంటే మార్గం మధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ నీ తప్పించబోయి కారు బోల్తా పడి పల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాయ్యాయి. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆమెను దగ్గరలో ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు అమ్మాయి పరిస్థితీ చూసి విషమంగా ఉందని వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయాలని అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ కి సుమారు 5 నుండి 8 లక్షలు పైగా ఖర్చు అవుతాయని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ పరిస్థితులు అంత ఖర్చులు భరించే స్తోమత లేదని, కన్నీళ్ళతో చేతులు జోడిస్తూ ఆర్థిక సహాయం కొరకు వేడుకున్నారు. తోచిన సహాయం తో ఒక నిండు ప్రాణాన్ని కాపాడి తమ ఆశల దీపాన్ని అరకుండా చూడాలని దీనంగా వేడుకుంటున్నారు.
ఆదుకునే దాతలు 9948123392 నంబర్ కి సహాయం చేయాలని వేడుకుంటున్నారు

తాజావార్తలు