పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

సబ్‌కలెక్టర్‌ భారతి హోళ్లీకేరి
మెదక్‌, జనవరి 30 (): పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేలు అందించాలని మెదక్‌ సబ్‌కలెక్టర్‌ భారతి హోల్లీకురి ఆదేశించారు. బుధవారంనాడు మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వైద్యసేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పెషెంట్లకు బ్రెడ్డు, పాలు ఎలా అందుతున్నాయని అడిగారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉండేలా చేసుకోవాలన్నారు. దోమలు బాగా ఉన్నాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అయిన పేషంట్లను, గర్భిణీ స్త్రీలను, బాలింతలకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సబ్‌కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ రాంప్రసాద్‌ తదితరులు ఉన్నారు.