*పేద ప్రజలకు ( సీఎం.ఆర్.ఎఫ్) చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

మద్దూర్ (జనంసాక్షి ): కొడంగల్ ఎమ్మెల్యే పార్టీ  కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 130 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 లక్షల 15వేల  రూపాయల విలువగల చెక్కులను పేద ప్రజలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి  అందజేశారు.
 కొడంగల్ మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు 11 లక్షల 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను  ఎమ్మెల్యే అందించారు.
కోస్గి మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 5 లక్షల 40 వేల రూపాయలు  సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.
మద్దూర్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు 7 లక్షల 43 వేల రూపాయలు  సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
దౌల్తాబాద్ మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు 10 లక్షల 31 వేల 900 రూపాయలు చెక్కులను అందించారు.
బొంరస్ పెట్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 9 లక్షల 9 వేల 100 రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
పేద ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు  చేస్తున్నామని అన్నారు.
పేద ప్రజలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి  ద్వారా చికిత్స  కోసం డబ్బులను ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నియోజకవర్గ  ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.