పేద ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి
కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గురువారం మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయం(ధర్మన్న భవన్)ను సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి ప్రారంభించి మాట్లాడుతూ…స్వాతంత్య్రం మా జన్మహక్కు అని గర్జించి స్వాతంత్య్రం కోసం అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కార్మిక, ప్రజా హక్కుల కోసం ఉద్యమిస్తున్న సీపీఐని నాటి బ్రిటిష్ పాలకులు నిషేధం విధించిన మొక్కవోని ధైర్యంతో వివిధ కార్మిక, విద్యార్థి ,మహిళా ప్రజా సంఘాలను నిర్మించి బ్రిటిష్ పాలకుల మెడలు వచ్చిందన్నారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి పది లక్షల ఎకరాలను పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ కే దక్కుతుందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒకే బాట, ఒకే మాటగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిద నన్నారు.తెలంగాణ రాష్ర్టంలో నయా నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశ సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అమ్మే యడమే దేశభక్తా అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్,మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్, సీపీఐ నాయకులు మహేందర్, బండారు వెంకన్న,జిలానీ,బుక్యా వీరన్న,వెంకన్న, అమీర్, నరముల యాకయ్య, ఉప్పలయ్య ,రాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.