పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
అర్హులందరికీ ప్రభుత్వ ఆసరా పింఛన్ రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్ ఆలంపూర్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చైర్మన్ సాయిచంద్ అన్నారు.
57 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా ఫించన్లు మంజూరు చేసింది.గురువారం అలంపూర్ మున్సిపలటీ లో బి ఆర్ ఎస్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ అధ్యక్షతన నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసి 216 మంది లబ్ధిదారులకు మంజూరైన నూతన ఆసరా కార్డులను అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మెన్ సాయి చందు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ప్రజా సంక్షేమం, ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు నెలవారీగా ప్రభుత్వం ఫించన్లు అందిస్తుందని, ఒంటరి మహిళలకు సైతం ఫించన్లు ఇస్తున్న ఘనత తమ టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నూతన ఆసరా కార్డుల ప్రత్యేకతను ఆయన వివరించారు. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసుకునే పేదలకు ఎంతో కొంత అవసరం అందించాలని లక్ష్యంతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి మీ నిండు ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా సాయి చందు మాట్లాడుతూ,రావాలి కేసీఆర్,కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని పాట పాడుతూ ఊర్రూతలూగించే ప్రసంగం చేశారు.మహిళలకు,తల్లులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం కేసీఆర్ దన్నారు. కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం దేశంలోనే ఎవరూలేరు అని పేర్కొన్నారు ఎలాంటి టెన్షన్ లేకుండా పెన్షన్లు ప్రతీ కుటుంబానికి అందుతున్నాయన్నరు.ఎలాంటి దలరి వ్యవస్థ లేకుండా నేరుగా హైదరాబాదులో ఉండి ఒక బటన్ నొక్కితే చాలు మీ అకౌంట్లో డబ్బులు వారి టింగ్ టింగ్ అని మెసేజ్ లు వస్తున్నాయి అని అన్నారు.ఉచితాలంటూ పేద ప్రజల పై కక్ష గట్టిన మోడీ ప్రభుత్వానికి ముసలల్లోకి అన్నం పెడితే బాధ ఎందుకని ఆయన నిలదీశారు.బీజేపీ పేదోళ్లకు వ్యతిరేకం అని, టీఆర్ ఎస్ పేదోళ్ల పార్టీ స్పష్టం చేశారు.
తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని ప్రజలు అనుకుంటున్నారని, మన దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని ఆయన అన్నారు. మహిళలకు పెద్దపీట వేసి, గౌరవించుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధు అని, ఆయన లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి దేశం లోనే లేరని, తెలంగాణ మాదిరిగా మహిళలను గౌరవించుకునే రాష్ట్రం ఎక్కడాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్
మహిళలకు అన్ని దశల్లో అన్న లా, మేనమామ లా,తాత లా అండగా నిలుస్తున్న కేసీఆర్ దార్శనికుడైన పాలకుడన్నారు..
అనంతరం స్థానిక శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం మరియు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మెన్ సాయి చందు శ్రీశ్రీ శ్రీ . జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ ఈవో పురేందర్ ,ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు అధికారులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..