పేరుకుపోతున్న సమస్యల పరిష్కారం విఫలం: 15 వరకు పోరాటం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు…

ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయని పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని పరిష్కారం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు విమర్శించారు. పరిష్కారం కోసం డిసెంబర్ 15 వరకు జిల్లా వ్యాపితంగా పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు, శనివారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు, స్థానిక రాష్ట్రస్థాయి సమస్యలను వెల్లడించారు. జిల్లాలో పలు గ్రామాల్లో పట్టాలి చ్చిన స్థలాలు చూపలేదన్నారు  ప్రతి గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీల సమస్య ఉందన్నారు మూడేళ్ల క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు లేవన్నారు ఆరేళ్ల క్రితం 2620 ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇచ్చారన్నారు ఆ తర్వాత కొత్తవారికి ఇవ్వలేదన్నారు, ప్రభుత్వాసుపత్రిలో కాన్పులైన వారికి కిట్టు మాత్రమే ఇచ్చి 4 వేల నగదు ఇవ్వటం లేదన్నారు అంబులెన్సులు లేని ఏడు మండలాలకు అంబులెన్స్లు వెంటనే ఇవ్వాలన్నారు. అభయహస్తం  పింఛన్లు ఇవ్వటం లేదన్నారు  జిల్లాలోని మూడు అంగన్వాడి ప్రాజెక్టుల పరిధిలో వయోవృద్ధులైన అంగన్వాడి టీచర్ కు 5 లక్షలు ఆయాకు మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు ఇంకా వాయిదాలు సరికాదన్నారు పెరిగిన కార్డుల సంఖ్య  కొత్త కాలనీలలో  డీలర్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. 57 ఏళ్ల వృద్ధులకు ఇటీవల పింఛన్లు ఇచ్చారని అదే సమయంలో దరఖాస్తు చేసుకున్న కొందరు వృద్ధులు వితంతువులకు పింఛన్లు మంజూరు కాలేదన్నారు, తాజాగా 57 ఏళ్లు నిండిన కొత్తవారికి బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. జిల్లాలో రబీ సాగు నత్త నడకన సాగుతుందన్నారు, బ్యాంకులు సకాలంలో పంట రుణం ఇవ్వకపోవడం కారణమన్నారు ఇప్పటికీ జిల్లాలో రబీ సాగు లక్ష్యంలో సగం కూడా పూర్తి కాలేదు అన్నారు ఖరీఫ్ లోను నిర్ణీత లక్ష్యం మేరకు పంట రుణం ఇవ్వలేదని బాధ్యు లు పట్టించుకోలేదన్నారు జిల్లాలో ఖరీఫ్లో వరి వేరుశనగ పత్తి ప్రధాన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు  వేరుశనగ క్వింటాలుకు కనీసం 9000 ,ప్రత్తికి 10000, వరికి 2500 ఇవ్వాలన్నది రైతుల డిమాండ్ అన్నారు కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో రైతులకు డబ్బు జమ చేయాలన్నారు. ఉపాధి హామీ బిల్లులు సకాలంలో ఇప్పించాలన్నారు  సమస్యలపై 14వ తేదీ తాసిల్దార్ కార్యాలయాల వద్ద 15వ తేదీన  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజల సమీకరించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈసమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ ప్రధాన కార్యదర్శి మోష ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు