పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.

 

 

 

 

 

 

రాజంపేట్ (జనంసాక్షి) మే 29రాజంపేట్ మండల పరిధిలోని ఆర్గోoడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం పరిధిలోని రైతులు మక్కలు కొనుగోలు చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతి గింజని కొంటామని చెప్పడం, ఇక్కడ చైర్మన్ మాత్రం రైతులు హమాలీ ఇస్తేనే సెంటర్ ఓపెన్ చేస్తా అని మాట్లాడడం విడ్డురంగా ఉంది.. హమాలీ కూలీలను ఇవ్వకపోతే నేను చేస్తానా, సిఈఓ మక్కలు జోకుతాడా అని మాట్లాడడం ఎంత వరకు సమంజసం.. గ్రామంలో అసలు సెంటర్ ఉందా లేదా అన్న అపోహలు కలుగుతున్నాయి.ఎవరు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఎట్లా. ఒకవైపు వర్షానికి తడిసి ముద్ద అవుతున్నాయాని రైతులు సిఈఓ,చైర్మన్ తీరుపై మండిపడుతున్నారు.చైర్మన్, డైరెక్టర్లు స్వయంగా హమాలీ కూలీలను మాట్లాడి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించె వరకు పట్టు విడవబొమని రైతులు బిష్మించి కూర్చున్నారు.ఇదే విషయం సీఈఓ సాయిలు వివరణ కోరగా హమాలీ కూలీలను రైతులు ఇస్తేనే మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తానని అన్నారు.

తాజావార్తలు