పేలుడు పదార్థాలు స్వాధీనం
యాదాద్రి భువనగిరి,జూలై17(జనం సాక్షి): భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన బీబీనగర్ మండలం రాఘవాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. 150డినేటర్లు, 76 జల్‌బార్స్, రెండు తీగల బిండళ్లు, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు తరలిస్తున్న దుర్గయ్య అనేవ్యక్తిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.