పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు: కేంద్ర ఆరోగ్యశాఖ నోటీఫికేషన్ జారీ
ఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ముద్రించేందుకు ఫోటోలతో కూడిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నోటిపై చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వీటిని ముద్రించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. ధూమపానం, నమిలే పొగాకుకు సంబందించిన ఉత్పత్తులకోసం మూడేసీ జతల చొప్పున హెచ్చరికల చిత్రాలను నోటిపై చేసింది. కొత్త హెచ్చరికలు 2013, ఎప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఆరోగ్యానికి సంబందించిన హెచ్చరికల్ని అక్షరాల రూపంలో చెప్పడంకన్నా చిత్రాలు, గ్రాఫిక్‌ల రూపంలో చెప్పడంవల్ల నిరక్షరాస్యులు, చిన్నారులపై ప్రభావం బాగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా చేర్చిన నిబంధనల ప్రకారం ప్యాకెట్లపై హెచ్చరిక అనే పదాన్ని ఎర్రని అక్షరాలతో ముద్రించాలి ప్యాకెట్ల పరిణామాలు మారినా వాటిపై హెచ్చరిక చిత్రాలు చెదిరిపోకుండా ఉండేలా నిర్ధిష్ట పరిణామాణాల్లోనే ముద్రించాలి.