పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెట్టొద్దు

పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెట్టొద్దని వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ అన్నారు.శుక్రవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామ రైతు వేదిక లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెడితే విత్తనాలు మాడిపోవడమే కాకుండా డా భూమిలో వుండే పెంకు పురుగులు,మట్టి పురుగులు తినే అవకాశం ఉంటుందన్నారు.కనీసం 60-70 చంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు పెట్టుకోవాలని సూచించారు.అనంతరం సాగు బాగు వ్యాస దీపిక, పత్తి పంట యాజమాన్య పద్ధతులు అనే పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో  దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు, భాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా వాడకం,పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగాలు, ఎరువులను దఫ దాఫాలుగా వినియోగించడం కలిగే లాభాలు ,పత్తి,కంది పంట సాగు పెంచడం తదితర విషయాలపై అవగాహన కల్పించిన ట్లు వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష తెలిపారు.  జీలుగ విత్తనాలు మండల కేంద్రంలోని ఆగ్రోస్ లో అందుబాటులో  ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మధు తో పాటు రైతుబంధు  కోఆర్డినేటర్ రామచంద్రయ్య, రైతుబంధు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area