పొత్తులతో విసిగి పోయాం : కిషన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ : పొత్తులతో విసిగి పోయామని.. భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తు ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటన ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆయన మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. భాజపాతో పొత్తు తప్పిదమని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులతో రాజ్యం నడుస్తుంటే.. మన సీఎం కర్ణాటకలో నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు.