పొన్నం పాదయాత్రను విజయవంతం చేయాలి
రుద్రంగి ఆగస్టు 8 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మరియు మండల ఉపాధ్యక్షుడు మనోహర్ లు మాట్లాడుతూ…ఈనెల 9 నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ,కాంగ్రెస్ పటిష్టతకై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ చేపట్టబోయే పాదయాత్రను విజయవంతం చేయాలనిి కోరారు అలాగే
ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పొన్నం పాదయాత్ర చేస్తున్నారన్నారు.గంభీరావు పేట పెద్దమ్మ స్టేజీ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఈ నెల 18 న ఎల్కతుర్తి వరకు సాగు తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,పిడుగు లచ్చిరెడ్డి,మాడిశెట్టి అభిలాష్, సూర యాదయ్య,తర్రే లింగం,గుగ్గిళ్ళ వెంకటేష్,సామ మోహన్ రెడ్డి,పల్లి గంగాధర్, కట్కూరి దాసు తదితరులు పాల్గొన్నారు.