పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

సూర్యాపేట,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సూర్యాపేట స్టడీసర్కిల్‌లో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల స్టడీసర్కిల్‌ సూర్యాపేట కార్యదర్శి దయానందరాణి తెలిపారు. ఈనెల 10 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈనెల 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు దీని ఆధారంగా ఎస్సీలు 75శాతం, ఎస్టీలు 10శాతం ,బీసీలు 15శాతం, మొత్తంలో మహళలకు 33శాతంతోపాటు వికలాంగులకు 3శాతం సీట్లు కేటాయించి మొత్తం 100 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 3 నెలలు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి మే 26 వరకు ఉచిత భోజన వసతి కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  వివరాల కోసం సూర్యాపేట స్టడీ సర్కిల్‌కు చెందిన డైరెక్టర్‌ రాములును 999129935 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.