పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి .. – ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి ప్రతినిధి జూన్3 (జనంసాక్షి);
నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ నెల 5వ తేది న తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కామారెడ్డి పట్టణం లో కళా భారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 90 వేల ఉద్యోగ నియామకాలకు ప్రకటన వెలువరించడం తో పాటు కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ 1 తదితర పోస్టులకు సంబందించి నోటిఫికేషన్ లు జారీ చేసారని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని కోరారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆద్వర్యం లో ఈ నెల 5 వ తేదిన కామారెడ్డి లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కు హాజరై గ్రూప్1,2 అధికారులు అందించే విలువైన సూచనల ను పాటించాలని కోరారు. ఈ సందర్భం గా తెలంగాణ గ్రూప్ 1ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్టివో డాక్టర్ ,యన్ వాణి, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీకాంత్
గొట్టిముకుల నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.